News January 24, 2025
WNP: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.175 కోట్ల నిధులు: మంత్రి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేవలం వనపర్తి జిల్లాకే రూ.175 కోట్ల నిధులు కేటాయించామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సల్కలాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. అనవసరంగా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని, పౌష్టికాహారం, తగిన వ్యాయామం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉండొచ్చన్నారు. పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా నాణ్యమైన బోధనలు అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు.
Similar News
News January 18, 2026
జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.
News January 18, 2026
మేడారం: జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్!

రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో మొత్తం 18 అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. 12 అంశాలపై చర్చ పూర్తవ్వగా.. మరో 6 అంశాలపై భేటీ కొనసాగుతోంది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
News January 18, 2026
అనకాపల్లి: విషాదం.. పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య

అనకాపల్లి పరిధిలోగల శారదానదిలోకి దూకి వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. అనకాపల్లి సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన భారతి(19)కి వివాహం జరిగి ఏడాది అయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


