News January 24, 2025
KMR: డేటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభల్లో విచారణ చేపట్టిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి డేటాను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. శుక్రవారంతో సభలు ముగియనుండడంతో డేటా ఎంట్రీని త్వరగా పూర్తిచేయాలన్నారు. సమస్యలు తలెత్తకుండా సభలు నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
Similar News
News September 18, 2025
కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 18, 2025
నిర్మల్: ‘ఈనెల 20న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం’

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈనెల 20వ తేదీన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలను పాఠశాలలో నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన్న గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరయ్యేలా వారందరికీ ఆహ్వానం అందించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించేలా సమావేశం నిర్వహించాలన్నారు.
News September 18, 2025
అనకాపల్లి జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాను డ్రగ్స్, క్రైమ్ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్న అంశాలను వివరించారు. హాట్ స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ఆకతాయిల బెడద లేకుండా చూడాలన్నారు. జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు.