News January 24, 2025
GWL: అబాండెడ్ వాహనాలకు ఈనెల 30న వేలం పాట

పోలీస్ తనిఖీల్లో పట్టుబడి ఎవరు గుర్తించలేని అబాండెడ్ వాహనాలకు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు పీజేపీ క్యాంపులోని సాయుధ దళ పోలీస్ కార్యాలయం ఆవరణలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గలవారు రూ.200 ఫీజు చెల్లించి ఆధార్ కార్డుతో వేలంపాటలో పాల్గొనాలని సూచించారు. వేలంపాటకు ఒకరోజు ముందు వాహనాలు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
Similar News
News March 14, 2025
సంగారెడ్డి: గుండెపోటుతో యువకుడి మృతి

హత్నూర మండలం శేరుకంపల్లికి చెందిన దండు శివకుమార్(28) నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు. స్థానికుల వివరాలిలా.. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న శివ.. గురువారం రాత్రి ఇంట్లో గుండెపోటుకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమార్పీఎస్ నాయకులుగా పనిచేస్తూ సమాజ సేవ చేసేవారని స్థానికులు తెలిపారు. అందరితో కలిసి మెలిసి ఉండే శివ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 14, 2025
Way2News ఎఫెక్ట్.. వీరభద్రపేట రోడ్డుకు మోక్షం

దేవరాపల్లి(M) వీరభద్రపేటకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు వినూత్న నిరసన తెలిపిన విషయం తెలిసిందే. Way2News ఆ సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వెలుగులోకి తెచ్చింది. మార్చి 4న గ్రామస్థుల సమస్యలపై ప్రత్యేక వీడియో కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రూ.84లక్షల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ నిధులతో తారు రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
News March 14, 2025
దైరతుల్ మారిఫిల్ డైరెక్టర్‌గా ప్రొ. షుకూర్

ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా డైరెక్టర్‌గా ప్రొ. ఎస్ఏ షుకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలు, అరబిక్ గ్రంథాలను భద్రపరిచేందుకు నిజాంపాలనలో నెలకొల్పిన ఈ కేంద్రం ఓయూకు అనుబంధంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన షుకూర్ తిరిగి అదే పదవిలో నియమితులయ్యారు.