News January 24, 2025
ఎస్‌జిఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు నామాపూర్ విద్యార్థిని ఎంపిక

ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని గూడెపు వంశిక ఈనెల 22 నుండి భద్రాచలంలో జరిగే రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కుంట శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి పోటీల్లో అండర్ 17 క్రికెట్ సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వంశిక రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన బాలికను ప్రధానోపాధ్యాయులు సుధాకర్ అభినందించారు.
Similar News
News July 4, 2025
నాటుసారా నిర్మూలనతో సమాజానికి నవోదయం: కలెక్టర్

ప్రజల్లో అవగాహన కలిగించి రాష్ట్రంలో నాటు సారాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవోదయం కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను అయన సందర్శించారు. జిల్లాలో మొదటి దశ నవోదయం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో నవోదయం 2.0ను ప్రారంభించామని చెప్పారు.
News July 4, 2025
నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో CSR నిధులు ఉన్నప్పటికీ మైక్రో వాటర్ ఫిల్టర్‌ల నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని RWS అధికారులను కలెక్టర్ బాలాజీ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్‌లు, అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. గ్రామాల్లో మైక్రో వాటర్ ఫిల్టర్‌లను నిర్మించడంలో RWS ఇంజినీర్‌లు శ్రద్ద చూపడం లేదని కలెక్టర్ అన్నారు.
News July 4, 2025
ఖమ్మం: చిన్నారి నృత్యం.. గిన్నిస్ బుక్ రికార్డులో చోటు.!

వేంసూరు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి-మంజీర దంపతుల పదేళ్ల కూతురు చూర్ణిక కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ చాటింది. HYDలో జరిగిన పోటీలో 4,219 మంది నృత్యకారులతో కలిసి చూర్ణిక పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. ప్రతిభ చాటిన ఆమెకు నిర్వాహకులు శ్రీ లలిత, వసుంధర గోవిందరాజ్, శ్వేత సర్టిఫికెట్ అందజేశారు. చిన్నారికి మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు.