News January 24, 2025

నిబంధనల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలి: వైద్యాధికారి

image

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలని BHPL జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రులలోని అల్ట్రా సౌండ్ యంత్రాలను పరిశీలించారు. ప్రైవేటు ఆసుపత్రులలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలన్నారు.

Similar News

News November 3, 2025

మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

image

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్‌తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.

జనగామ జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాలకుర్తిలో 2.8, జఫర్‌గఢ్ 3.8, కొడకండ్ల 8.2, తరిగొప్పుల 15.2, నర్మెట్ట 8.6, జనగామ 1.4, రఘునాథపల్లి 1.2, లింగలఘనపూర్ 1.0మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.