News January 24, 2025

పోలీస్ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న డిస్ట్రిక్ పోలీస్ మీట్ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా పోలీసులు శాంతి భద్రత పర్యవేక్షణలో ముందున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, పోలీసులు పాల్గొన్నారు.

Similar News

News January 13, 2026

తల్లిదండ్రుల అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలి: SC

image

తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BV నాగరత్న కోరారు. ‘తమ తల్లిదండ్రులు ఆదాయానికి మించి సంపాదించిన దేన్నైనా పిల్లలు తీసుకోకూడదు. వాటికి లబ్ధిదారులుగా ఉండొద్దు. ఇది దేశానికి చేసిన గొప్ప సేవ అవుతుంది’ అని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏకు చట్టబద్ధతపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

News January 13, 2026

BREAKING: యాదాద్రి: అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు

image

భూరిజిస్ట్రేషన్ల ఛార్జీల చెల్లింపుల్లో అక్రమాలపై యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, వలిగొండ PSలలో తహశీల్దార్లు ఈరోజు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ల ఫిర్యాదు మేరకు 4 PSలల్లో ఇంటర్‌నెట్ సెంటర్ల నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు 19 మందిపై కేసులు నమోదు చేశారు. వలిగొండ రూ.15 లక్షలు యాదగిరిగుట్ట రూ.72 లక్షలు, బొమ్మలరామారంలో రూ.25 లక్షలు, తుర్కపల్లిలో రూ.14 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు.

News January 13, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ చైనా మాంజా వాడొద్దు: మణుగూరు DSP
✓ చుంచుపల్లి: పాఠశాల వద్ద హైటెన్షన్ ముప్పు
✓ సుజాతనగర్: ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ
✓ అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
✓ ఈనెల 16, 17న పాల్వంచ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
✓ దుమ్ముగూడెం: హెల్త్ సెంటర్లను తనిఖీ చేసిన DMHO
✓ కొత్తగూడెం: లిక్విడ్ గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
✓ దుమ్ముగూడెం: విద్యుత్ షాక్‌తో వర్కర్‌కు గాయాలు