News January 24, 2025

తాండూరులో ఈ నెల 28 నుంచి ఉచిత ధ్యాన శిక్షణ

image

ఈనెల 28 నుంచి 3 రోజులపాటు తాండూర్‌లో ఉచిత ధ్యాన శిక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాస్ పరమేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. 15 ఏళ్లు పైబడిన వారందరూ ధ్యాన శిక్షణకు హాజరు కావాలని కోరారు.

Similar News

News November 8, 2025

విశాఖ: ‘పెండింగ్‌లో ఉన్న నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు వేగవంతం’

image

దసరా, దీపావళి, GST సంస్కరణల సందర్భంగా ప్రజలు వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలు కొనుగోలు జరగడంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పెండింగ్‌ వలన రవాణా శాఖ కార్యాలయంలో అదనపు సిబ్బందిని వినియోగించి వాహనాలకు శుక్రవారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించామని DTC R.C.H.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక నంబర్లు కొనుగోలు చేసిన వారికీ నంబర్లు కేటాయించిన వెంటనే వాటిని అప్రూవల్ చేస్తామన్నారు.

News November 8, 2025

మందమర్రి: 16న డిపెండెంట్లకు పోస్టింగ్ ఆర్డర్స్

image

సింగరేణిలో మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు ఈ నెల 16న ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ శుక్రవారం తెలిపారు. దాదాపు 473 మంది డిపెండెంట్లకు కొత్తగూడెంలో పోస్టింగ్ ఆర్డర్స్ అందజేస్తారని పేర్కొన్నారు. ఏడు నెలలుగా నిలిచిన మెడికల్ బోర్డును ఈ నెలాఖరు లోపు నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు.

News November 8, 2025

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.