News January 24, 2025

క్రీడల అభివృద్ధి కోసం త్వరలోనే సమావేశం: కలెక్టర్ ప్రావీణ్య

image

హనుమకొండ జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం అన్ని వర్గాలతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జేఎన్ఎస్ స్టేడియాన్ని కలెక్టర్ ప్రావీణ్య గురువారం సందర్శించారు. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, జిమ్నాస్టిక్ హాల్‌ను పరిశీలించి నూతనంగా నిర్మిస్తున్న రెజ్లింగ్, కబడ్డీ ఇండోర్ స్టేడియం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. క్రీడాకారుల టాయిలెట్ల ఏర్పాటు, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 4, 2025

సంగారెడ్డి: కానిస్టేబుల్ ఆత్మహత్య‌కు కారణం ఇదే.!

image

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా లక్షల రూపాయలు నష్టపోవడంతో కానిస్టేబుల్ సందీప్ మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై ఆత్మహత్య చేసుకున్నారు. 2024 బ్యాచ్‌కు చెందిన సందీప్ గతంలో శిక్షణ సమయంలోనూ గేమింగ్ వ్యసనంతో ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస కావద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.

News November 4, 2025

మెదక్: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు నిజాంపేట విద్యార్థి ఎంపిక

image

రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలకు నిజాంపేట మండలానికి చెందిన విద్యార్థి కార్తీక్ గౌడ్ ఎంపికయ్యాడు. తూప్రాన్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ అండర్-17 ఉమ్మడి మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్‌లో కార్తీక్ గౌడ్ ఎంపికైనట్లు జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జ్ఞానమాల, పీడీ ప్రవీణ్ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.

News November 4, 2025

నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

✦ 1889: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం (ఫొటోలో)
✦ 1929: గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం (ఫొటోలో)
✦ 1932: సినీ దర్శకుడు, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ జననం
✦ 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ జననం
✦ 1964: దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు జననం
✦ 1971: నటి టబు జననం