News January 24, 2025

MNCL: పీఎంశ్రీ నిధులు సక్రమంగా వినియోగించాలి

image

జిల్లాలో ఎంపిక చేయబడిన 25 పాఠశాలల్లో పీఎం శ్రీ నిధులను సక్రమంగా వినియోగించాలని డీఈఓ యాదయ్య అన్నారు. మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పీఎం శ్రీ పథకంతో పాఠశాలల మహర్దశ పడుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు తీర్మానం ద్వారా నిధులు సక్రమంగా వినియోగించి విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలని సూచించారు.

Similar News

News November 6, 2025

కశింకోట: 48 కిలోల గంజాయి పట్టివేత

image

కశింకోట మండలం అచ్చెర్ల జంక్షన్ వద్ద గురువారం 48 కిలోల గంజాయి (20 ప్యాకెట్లు) స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఈగల్ టీమ్ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, వైట్ మారుతి కారులో గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరొక వ్యక్తి పరారైనట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News November 6, 2025

అనకాపల్లి: ఈ నెల 11 నుంచి క్రీడల ఎంపిక పోటీలు

image

సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడల ఎంపిక పోటీలు ఈనెల 11 నుంచి 13 వరకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం, షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్, పరవాడ ఇండోర్ స్టేడియం, అనకాపల్లి జార్జ్ క్లబ్ వద్ద నిర్వహించనున్నారు. ఈ వివరాలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ గురువారం వెల్లడించారు. ఈ పోటీల్లో ఎంపికైన వారు ఈనెల 19 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

News November 6, 2025

ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

image

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్‌స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్‌లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్‌స్టాలో 14L, యూట్యూబ్‌లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.