News March 18, 2024
HYD: నేటి నుంచి జూన్ 4 వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్లు
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, గౌతమ్, శశాంక, నారాయణరెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. SHARE IT
Similar News
News November 24, 2024
GHMCలో కుక్కల బోన్లు చూశారా..?
గ్రేటర్ HYDలోని ఆరు జోన్ల పరిధిలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా కుక్కల జైళ్ల మాదిరి బోన్లు అందుబాటులో ఉంచారు. కుక్కల బెడదపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కుక్కలకు వ్యాక్సినేషన్ అందించి, వ్యాధులు ఉన్న కుక్కలను గుర్తించి వాటిని ఇక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరికొన్నింటికి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 24, 2024
HYD: 15 ఏళ్లు దాటితే సీజ్ చేయండి: మంత్రి
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఖైరతాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, RC సహా అన్ని పత్రాలు చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలన్నారు. 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
News November 24, 2024
HYDలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తి
HYD కలెక్టరేట్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తయింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి రిజర్వేషన్లు కల్పించే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన వారు, వినతి పత్రాలు సైతం అందించినట్లుగా HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు.