News January 24, 2025
భద్రాద్రి: నిత్యాన్నదానానికి రూ.100,116 విరాళం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గురువారం భక్తులు విరాళం అందజేశారు. ఖమ్మం జిల్లా గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎన్సీహెచ్. కృష్ణమాచార్యులు-రమాదేవి దంపతులు స్వామివారి అన్నదానం నిమిత్తం రూ.100,116 లను ఆలయ ఈవో రమాదేవికి విరాళంగా అందజేశారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Similar News
News January 24, 2025
ఖమ్మం: గ్రామసభల ఆప్డేట్
ఖమ్మం జిల్లాలోని 589 గ్రామపంచాయతీలలో మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించారు. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాలకు 1,42,682 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల లిస్ట్‌లో అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామసభల వద్ద జనం బారులు తీరారు. సభలు నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులపై మరింత స్పష్టత రానుంది.
News January 24, 2025
నంద్యాల జిల్లా కలెక్టర్‌కు అవార్డు
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు వరించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆమెకు అవార్డును బహూకరించనున్నారు.
News January 24, 2025
నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
TG: ప్రైవేటు ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ‘డీట్’ యాప్ తెచ్చింది. AIతో పనిచేసే దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్హత, స్కిల్స్ ఎంటర్ చేస్తే రెజ్యుమే తయారవుతుంది. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, వర్క్ ఫ్రం హోంతో పాటు ఇంటర్న్‌షిప్ ఆప్షన్స్ ఉంటాయి. ఐటీ, ఆటోమొబైల్స్, ఫార్మా, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ తదితర కంపెనీలు ఇందులో రిజిస్టరై ఉండగా వాటికి కావాల్సినవారి రెజ్యుమేలను యాప్ రిఫర్ చేస్తుంది.