News January 24, 2025

ట్రంప్ ఆర్డర్ నిలిపివేత.. ఎన్ని రోజులంటే?

image

వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ <<15240441>>హక్కు<<>>ను రద్దు చేసిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సియాటెల్ జడ్జి ఆదేశాల ప్రకారం ఆ ఆర్డర్ దేశ వ్యాప్తంగా 14 రోజుల పాటు అమలు కాదు. అలాగే, విచారణ సమయంలో జడ్జి మాట్లాడుతూ ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధమైందని బార్‌లోని సభ్యుడు నిస్సందేహంగా ఎలా చెప్పగలరో అర్థం కావడం లేదన్నారు. ఇది తన మనసును కలవరపెడుతోందని చెప్పారు.

Similar News

News January 24, 2025

NEFT/RTGS సిస్టమ్ హ్యాక్: సైబర్ నేరగాళ్ల బ్యాంకు దోపిడీ

image

కర్ణాటక విజయనగరలో డిజిటల్ దోపిడీ జరిగింది. బళ్లారి కోఆపరేటివ్ బ్యాంకు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు కొట్టేశారు. బ్యాంకు NEFT/RTGS లావాదేవీల వ్యవస్థను లక్ష్యంగా ఎంచుకొని హ్యాకింగ్ చేశారు. కస్టమర్ల అకౌంట్ నంబర్లు, IFSC కోడ్స్‌ను మ్యానిపులేట్ చేశారని తెలిసింది. జనవరి 10న జరిగిన ఈ దోపిడీపై FIR నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 24, 2025

సైఫ్ స్టేట్‌మెంట్‌: కరీనా, పనిమనిషి‌ పాత్రలపై మళ్లీ డౌట్స్!

image

యాక్టర్ <<15240990>>సైఫ్<<>> అలీఖాన్ స్టేట్‌మెంటుకు దాడి జరిగిన రోజు సంఘటనలకు పొంతన కుదరడం లేదని కొందరు అంటున్నారు. 11వ ఫ్లోర్‌లో ఉన్న కరీనా, తాను జే రూమ్‌కు వెళ్లామని సైఫ్ చెప్పారు. ఆగంతకుడిని చూశాక జేను వేరే గదిలోకి తీసుకెళ్లామన్నారు. కరీనా తనతోనే ఉన్నప్పుడు దాడి జరగ్గానే ఆమే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదన్నది ప్రశ్న? గదిలో బంధించిన షరీఫుల్ ఎలా తప్పించుకున్నాడు? ఈ ఘటనలో పని మనిషి పాత్రేంటో తెలియాల్సి ఉంది.

News January 24, 2025

DSC నోటిఫికేషన్ ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో మరో DSC నోటిఫికేషన్ APR తర్వాతే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం FEBలోనే నోటిఫికేషన్ రావాలి. కానీ SC వర్గీకరణ కోసం కమిషన్ వేసిన సర్కార్ నివేదిక కోసం ఎదురుచూస్తోంది. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు DSC నోటిఫికేషన్ రాకపోవచ్చని తెలుస్తోంది. ఇక గతేడాది 11,062 పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరో 5వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది.