News January 24, 2025
కామారెడ్డి: చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని వినతి

కామారెడ్డి పట్టణంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని జిల్లా చేపల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు మహేందర్ కోరారు. గురువారం కామారెడ్డి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నో కుటుంబాలు చేపలు పట్టుకొని జీవిస్తున్నారని తెలిపారు. చేపలు అమ్మేందుకు మార్కెట్ లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు.
Similar News
News September 13, 2025
NGKL: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సల్వాది బాలయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వ్యక్తి. అచ్చంపేట, సిద్దాపూర్, ఆమనగల్, మహబూబ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య మృతి పట్ల తోటి పోలీసు సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు.
News September 13, 2025
ప్రొద్దుటూరు: టీవీ చూడొద్దన్నందుకు ఆత్మహత్య

పనీపాటా లేకుండా పొద్దస్తమానం టీవీ చూస్తుంటే జీవనం ఎలా గడుస్తుందని తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. YMR కాలనీలో నివాసం ఉంటున్న హమాలి వర్కర్ రంగనాయకులు కుమారుడు మాణిక్యం శుక్రవారం ఉదయాన్నే టీవీ చూస్తుండటంతో తల్లి మందలించింది. మనస్తాపం చెందిన మాణిక్యం(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News September 13, 2025
వరంగల్: మావోయిస్టు బాలకృష్ణ అంత్యక్రియలపై మీమాంస..!

హనుమకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన మావోయిస్టు మోడెం బాలకృష్ణ అంత్యక్రియలపై మీమాంస నెలకొంది. స్వగ్రామం మడికొండ కాగా.. హైదరాబాదులో సైతం వారు ఉండటంతో బాలకృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయని ఆలోచిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాదులో స్థిరపడగా ఇప్పటివరకు మడికొండలో ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడే బాలకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని చర్చించుకుంటున్నారు.