News January 24, 2025
ఆర్మూర్: ఆదిలాబాద్ నుంచి గంజాయి తెచ్చి విక్రయాలు

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఆర్మూర్ చుట్టుపక్కల చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్న ఇద్దరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ K. స్టీవెన్సన్ తెలిపారు. తొర్లికొండకు చెందిన నూనె కిరణ్, అంకాపూర్ లో ఉంటున్న నూనె శ్రీకాంత్ లు అక్రమంగా గంజాయిని విక్రయాల కోసం బైక్ పై రవాణా చేస్తూ అంకాపూర్ వద్ద పట్టుబడ్డారని CIవివరించారు.
Similar News
News January 9, 2026
టీయూ: అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు

టీయూ ఇంటర్ కాలేజ్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ను శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. తుదిపోరు నిశిత డిగ్రీ కళాశాల, గిరిరాజ్ కళాశాల మధ్య జరగగా నిశిత కళాశాల విజేతగా నిలిచింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డా.రాంబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ నేత, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు.
News January 9, 2026
బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్‌కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
News January 9, 2026
టీయూ పరిధిలో పీజీ పరీక్షలు వాయిదా

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 16 నుంచి జరగాల్సిన పీజీ ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్ డబ్ల్యూ/ఎంబీఏ/ఎంసీఏ/ఐఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.


