News January 24, 2025
ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News January 13, 2026
ఆదిలాబాద్: రూ.90 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,710గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.90 పెరిగినట్లు వెల్లడించారు.
News January 12, 2026
ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.


