News January 24, 2025
జీతం ఆలస్యమైతే.. ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?
అనుకోని సందర్భాల్లో జీతం ఆలస్యమైతే ఏం చేస్తారు? చాలామంది ఉద్యోగులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడెలాగూ చాలామందికి రెండు మూడు బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అందుకే వచ్చిన జీతంలో ప్రతినెలా కొంత మొత్తాన్ని మరో ఖాతాకు బదిలీ చేసుకోవాలి. దీంతో అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉపయోగపడటంతో పాటు అప్పుల్లో కూరుకుపోకుండా చేస్తుంది. మరి మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?
Similar News
News January 24, 2025
ఎల్లుండి రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ విడుదల
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాను బోగవరపు తెరకెక్కిస్తోన్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈనెల 26న చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రవన్న మాస్ దావత్ షురూ రా భయ్’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.
News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను కిరాతకంగా నరికి <<15241806>>ముక్కలు ఉడికించిన <<>>కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను సేకరించారు. వాటి DNA శాంపిల్స్ తీసుకున్న పోలీసులు పిల్లల DNAతో టెస్ట్ చేయనున్నారు. భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్‌ఫ్రారెడ్ ద్వారా గుర్తించారు.
News January 24, 2025
కేబుల్ ఆపరేటర్లకు రూ.100 కోట్ల పెనాల్టీ రద్దు
AP: కేబుల్ ఆపరేటర్లపై విధించిన రూ.100 కోట్ల పెనాల్టీలను రద్దు చేస్తున్నట్లు ఫైబర్‌నెట్ ఛైర్మన్ GV రెడ్డి ప్రకటించారు. సెట్‌టాప్ బాక్స్ అద్దె కింద ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్‌కు నెలకు రూ.59 చొప్పున ఇకపై వసూలు చేయబోమన్నారు. ఫైబర్ నెట్ ప్లాన్లను సవరించి తక్కువ ధరకు సేవలు అందించేలా చర్యలు చేపడతామన్నారు. అటు తిరుమల కొండపై అన్ని ఆఫీసులు, షాపులు, ఇళ్లకు ఉచితంగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇస్తామన్నారు.