News January 24, 2025
నాన్‌స్టాప్ అడ్వెంచర్‌గా రాజమౌళి-మహేశ్ మూవీ!

మహేశ్‌తో రాజమౌళి చిత్రీకరిస్తున్న మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో నాన్‌స్టాప్ అడ్వెంచర్‌గా ఉంటుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే HYD అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఈ నెలాఖరులో మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా ఫైనల్ అయ్యారని, ఆమె బల్క్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Similar News
News November 4, 2025
అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా: లోకేశ్

AP: అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే వైసీపీ చీఫ్ <<18199297>>జగన్<<>> మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘తుఫాను వేళ సీఎం నుంచి పంచాయతీ ఉద్యోగి వరకు ప్రజల వద్దే ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు మేమేం చేశామో తెలిసేందుకు మీరిక్కడ లేరు. నాకు మహిళలంటే గౌరవం, అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా. తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది’ అని కౌంటర్ ఇచ్చారు.
News November 4, 2025
ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్‌లు, సబ్‌మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్‌యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.
News November 4, 2025
160 సీట్లకు పైనే గెలుస్తాం: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. 160కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ సమాన సీట్లు సాధిస్తాయని అన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు వంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.


