News January 24, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆదాయం ఎంతంటే..!

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.73,710 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.38,582, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,905, అన్నదానం రూ.13,223 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

Similar News

News September 17, 2025

ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

image

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.

News September 17, 2025

20న తిరుపతిలో జాబ్ మేళా

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 20వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఫార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

News September 17, 2025

హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్‌, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.