News January 24, 2025

కర్నూలులో 26న మాంసం విక్రయాలు బంద్

image

కర్నూలులో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్లు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మాంసం దుకాణాలు తెరవకూడదని స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలలో సైతం మాంసపు పదార్థాలు విక్రయించరాదన్నారు. నిబంధనలు పాటించకుంటే వ్యాపార ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 4, 2025

లక్ష దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న లక్ష దీపోత్సవ ఏర్పాట్లను స్థానిక ఎస్సై శివాంజల్‌తో కలిసి పరిశీలించారు. తుంగభద్ర నది తీరంలో పుణ్య హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీ మఠం అధికారులకు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్సై శివాంజల్‌కు సూచించారు.

News November 4, 2025

ఆదోని మార్కెట్‌లో పత్తి ధర రూ.7,555

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు నమోదయ్యాయి. పత్తి కనిష్ఠంగా రూ.4,000, గరిష్ఠంగా రూ.7,555 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,666, ఆముదాలు రూ.5,940 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోళ్లలో తేమ శాతం పేరుతో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

News November 4, 2025

జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులనున ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, తాగునీరు, శానిటేషన్, వ్యవసాయం తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.