News January 24, 2025
RTCలో సమ్మె సైరన్
TGSRTCలో సమ్మె సైరన్ మోగింది. హైర్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ నెల 27న HYDలోని బస్‌భవన్ ముందు ధర్నాకు దిగనున్నాయి. ఆ రోజే యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నాయి. RTC <<15210949>>ప్రైవేటీకరణలో <<>>భాగంగా హైర్ పద్ధతిలో బస్సులు ప్రవేశపెడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. RTC డిపోలను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని కార్మికులు స్పష్టం చేశారు.
Similar News
News January 24, 2025
ICC ODI జట్టులో భారత ప్లేయర్లకు నో ఛాన్స్
మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏ ఒక్కరూ స్థానం సంపాదించలేకపోయారు. పాక్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది. 11 మందితో కూడిన జట్టుకు శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకను సారథిగా ఎంపిక చేసింది. జట్టు: సయూమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, నిస్సాంక, కుశాల్ మెండిస్, అసలంక (C), రూథర్‌ఫర్డ్, ఒమర్జాయ్, హసరంగ, షాహీన్ షా అఫ్రీది, హారిస్ రవూఫ్, ఘజన్‌ఫర్.
News January 24, 2025
గంగూలీ బయోపిక్.. హీరో ఇతడేనా?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు దాదా రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. ‘ఉడాన్’ ఫేమ్ విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తారు. కాగా గంగూలీ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ 2021లోనే ప్రకటించారు.
News January 24, 2025
WOW: నేతాజీ ఆకారంలో రూట్ మ్యాప్.. 913km సైకిల్ తొక్కి..
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌కు చెందిన ఓ సైక్లిస్ట్ వినూత్నంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన సైక్లిస్ట్ అనిల్ కుమార్ బోస్ ఆకారంలో రూట్ మ్యాప్ గీసుకొని నగరంలో 11 రోజుల పాటు 913KMS తొక్కారు. నగరంలోని AOC సెంటర్‌లో ఆరంభించి ఫాక్స్ సాగర్ దగ్గర ముగించారు. తాను బోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఇలా చేసినట్లు అనిల్ తెలిపారు.