News March 18, 2024
SBI బాండ్ల వివరాలపై అనుమానాలు: పూనమ్
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తప్పుగా ఉన్నాయని పిటిషన్ వేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ మరో అనుమానం వ్యక్తం చేశారు. ‘నేను ఏప్రిల్-2018లో ఒక్కొక్కటి రూ.1000 చొప్పున 2ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశా. కానీ, ఎస్బీఐ రిలీజ్ చేసిన డేటాలో 20 అక్టోబర్ 2020లో కొన్నట్లు చూపారు. ఇది పొరపాటున జరిగిందా? లేక నా పేరుతో ఉన్న ఇంకెవరైనా బాండ్‌ను కొన్నారా? చెప్పాలి’ అని SBIని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Similar News
News January 8, 2025
‘దాదా’ స్మారకం: బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం
దేశ రాజకీయాల్లో ‘దాదా’గా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ స్మారకం నిర్మాణం నిర్ణయం వెనుక BJP సొంత వ్యూహాలు ఉన్నాయన్నది పలువురి అభిప్రాయం. ఒకవైపు మన్మోహన్ స్మారకం కోసం కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే తన తండ్రి స్మారకం గురించి ఎందుకు అడగలేదని ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ గతంలో INCని ప్రశ్నించారు. INC కూడా ప్రణబ్ స్మారకంపై మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
News January 8, 2025
ప్రధాని రాకకోసం ఎదురుచూస్తున్నాం: సీఎం
AP పర్యటనకు వస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా తామంతా ఎదురుచూస్తున్నట్లు సీఎం చెప్పారు.
News January 8, 2025
రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్
అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్‌గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.