News January 24, 2025
విశాఖ పోలీసుల అదుపులో నకిలీ మహిళా ఐఏఎస్..!

ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మహిళాIASతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమృత భాగ్యరేఖ అనే మహిళ MVPకాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి విశాఖCPకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో పోలీసులు విచారించగా ఆమె నకిలీ IASగా నిర్ధారణ అయింది.
Similar News
News September 21, 2025
ఈ-గవరన్నెన్స్ సదస్సును విజయవంతం చేయాలి: కలెక్టర్

విశాఖలో సెప్టెంబర్ 22, 23 తేదీలలో జరగనున్న 28వ జాతీయ ఈ-గవరన్నెన్స్ సదస్సును విజయవంతం చేయాలని జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ నిర్దేశించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News September 21, 2025
నాగావళి ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

విశాఖ మీదుగా సంబల్పూర్ – నాందేడ్ (20809) వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్ ఆదివారం రీ షెడ్యూలు అయింది. సంబల్పూర్‌లో ఆదివారం ఉదయం 10.50 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు విశాఖలోని రైల్వే అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.
News September 21, 2025
విశాఖలో శొంఠ్యాం కోడి రూ.300

మాధవధార, మురళి నగర్, మర్రిపాలెంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ చికెన్ లైవ్ రూ.160, స్కిన్ లెస్ రూ.280, విత్ స్కిన్ రూ.260, శొంఠ్యాం కోడి రూ.300కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. ఆదివారం కావడంతో వినియోగదారులు అధిక సంఖ్యలో మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.