News March 18, 2024

అకాల వర్షం.. రైతన్నలకు నష్టం

image

TG: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో కామారెడ్డిలో 20వేలు, నిజామాబాద్‌లో 6వేలు, సిరిసిల్లలో 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలతో పాటు గోధుమ, ఉల్లి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News September 4, 2025

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

image

కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే గణేశ్ శోభాయాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉండగా, పర్యటన రద్దైంది.

News September 4, 2025

వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ

image

దేశ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారుతాయని PM మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వపడాలి. గాంధీజీ నినాదం కూడా స్వదేశీ.. దాన్ని అందరం పాటించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

News September 4, 2025

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ కన్నుమూత

image

ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.