News January 24, 2025

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌ కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్‌లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149‌గా నిర్ణయించారు. మీ ఏరియాలో‌ ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT

Similar News

News January 25, 2026

రంగారెడ్డి: ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కార్యాలయాలు, పోలింగ్ బూత్ స్థాయుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు, యువత పెద్దఎత్తున పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

News January 25, 2026

HYD: ఓపెన్‌లో PG, డిప్లొమా చేయాలనుకుంటున్నారా?

image

ఈ ఎడాదికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో ఓపెన్ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌లకు సంబంధించిన వివిధ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య పద్మప్రియ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు sprtu.softelsolutions.in, www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 73306 23411 ఫోన్ చేయాలన్నారు.

News January 25, 2026

హైదరాబాద్‌లో హలో.. హలో..!

image

‘హలో.. హలో.. ఏంటి కాల్ జంప్ అవుతోంది’ ఇదే నగరవాసుల నోటి వెంట వినపడేది. ఇంట్లోనుంచి బయటికి వెళ్తేనే ఫోన్ సిగ్నల్ వస్తుందని Jio, Airtel యూజర్స్ చెబుతున్నమాట. నిన్నో వ్యక్తి RTO ఆఫీస్‌కెళ్తే సిగ్నల్ లేక అక్కడ జనాలంతా పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీకాదంటున్నారు. అక్కడికి వచ్చినవారంతా హలో అని అరుస్తూనే ఉన్నారట. ఇక శివారులో ఇంట్లో ఉంటే కనీసం వాట్సాప్ స్టేటస్‌ ప్లే కావడంలేదని వాపోతున్నారు. మీకూ సేమ్ ఇష్యూ ఉందా?