News January 24, 2025
రేపు మంచిర్యాలలో మినీ జాబ్ మేళా

మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ తెలిపారు. మినీ జాబ్ మేళాలో పేటీఎంలో 50 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి, ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. 18-35 ఏళ్ల పురుష అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 19, 2025
భీమడోలు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదు

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటలలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భీమడోలు మండలంలో అత్యధికంగా 16.2 మి.మీ., నూజివీడులో 2.8 మి.మీ, చాట్రాయిలో 1.8 మి.మీ, అగిరిపల్లిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన 24 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 22.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 0.8 మి.మీ.గా ఉందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు.
News September 19, 2025
సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.
News September 19, 2025
HYD: సోషల్ మీడియా వాడుతున్నారా? జాగ్రత్త!

సోషల్ మీడియా వాడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచించారు. పోస్ట్ చేసే ముందు ఆలోచించండి. వ్యక్తిగత, సున్నితమైన వివరాలు పంచుకోవద్దు. మీ భద్రత, గౌరవం మీరు పంచుకునే విషయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒక క్లిక్‌తోనే అంతటా వ్యాప్తి చెందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పోస్ట్ చేయండి. పంచుకునే ముందు ధ్రువీకరించండి. తప్పుడు సమాచారం అందరికీ హానికరంగా మారుతుందన్నారు.