News January 24, 2025
Stock Markets: ఓపెనింగ్‌కు సానుకూల సంకేతాలు..

స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌గా మొదలవ్వొచ్చు. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ 45PTS మేర పెరగడం దీనినే సూచిస్తోంది. డాలర్ ఇండెక్స్, ట్రెజరీ బాండు యీల్డుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఐటీ సహా మేజర్ కంపెనీల నుంచి మద్దతు లభిస్తే నిఫ్టీ 23,200 పైస్థాయిలో నిలదొక్కుకోవచ్చు. నేడు JSW Steel, HPCL, BOI, DLF, AUSFB, FED BANK, LAURUS LAB, SRIRAM FIN ఫలితాలు విడుదలవుతాయి.
Similar News
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
News July 5, 2025
ఎల్లుండి ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్ ఫలితాలు జులై 7న విడుదల కానున్నాయి. HYD ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం మ.3.30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8,9 తేదీల్లో రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. జూన్ 21న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. 71,757 మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
News July 5, 2025
ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా?: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డి <<16942338>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘మీ PayCM అందరినీ బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరా గాంధీ గొప్పతనం అర్థం కాదంటున్నాడు. ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా రాహుల్ గాంధీ? తెలంగాణను ఏఐసీసీకి ఏటీఏంగా మార్చినప్పటి నుంచి ఆయన ఏది పడితే అది మాట్లాడటాన్ని అనుమతిస్తున్న మీ విధానాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.