News January 24, 2025
శ్రీ బోరంచ నల్ల పోచమ్మ దివ్య దర్శనం

మానూర్ మండలంలోని బోరంచ నల్ల పోచమ్మను శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. మంజీర జలాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు ధరించి హారతి పాటతో నక్షత్ర హారతి ఇచ్చారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. చుట్టూపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధికంగా వచ్చారు.
Similar News
News October 23, 2025
ADB: మంట గలుస్తున్న మానవ సంబంధాలు

కుటుంబాలు ప్రేమ, ఆప్యాయతకు నిలువెత్తు ప్రతిరూపాలు. కానీ ఆ బంధాలు కాస్త కన్నీటి గాథలవుతున్నాయి. మంచిర్యాలలో పండుగపూటే భార్యను భర్త చంపుకోగా, జన్నారంలో మరోచోట కన్న కొడుకే తండ్రిని హతమార్చడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వివాహంపై మామ పెంచుకున్న కక్ష దహెగాంలో కోడలి ప్రాణం తీసింది. పవిత్రమైన అనుబంధాల్లో విషం నింపుతున్న ఈ ఘటనలు, నేటి సమాజంలో క్షీణిస్తున్న మానవ సంబంధాల విలువలకు అద్దం పడుతున్నాయి.
News October 23, 2025
అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం
News October 23, 2025
సంగారెడ్డి: ప్రవేశాలకు నేడే చివరి గడువు: డీఈఓ

ఉమ్మడి జిల్లాలోనీ వర్గల్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతులలో ప్రవేశం పొందేందుకు గడువు నేటి వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు https://www.navodaya.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.