News January 24, 2025
నారాయణపేట: మూడో రోజు 13,113 దరఖాస్తులు

నారాయణపేట జిల్లాలో ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు నిరసనలు, నిలదీతల మధ్య జరుగుతున్నాయి. మూడో రోజు 71 గ్రామ, 13 వార్డు సభలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 13,113 దరఖాస్తులు రాగా ఇందులో రేషన్ కార్డుకు 4,111, ఇళ్లకు 7,291, రైతు భరోసాకు 470, ఆత్మీయ భరోసాకు 1,241 వచ్చాయి. అర్హత ఉన్నా జాబితాలో తమ పేర్లు లేవని అధికారులను పలువురు నిలదీశారు. జాబితాలో పేరు లేని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 12, 2025
GNT: జిల్లాలో అదనంగా 264 పోలింగ్ కేంద్రాలు

గుంటూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ద్వారా అదనంగా 264 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాలులో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
News November 12, 2025
VKB: స్కూల్లో విద్యార్థికి విద్యుత్ షాక్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రక్షణ కంచె లేకుండా ఉన్న 33 కె.వి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదానికి కారణమైంది. భోజన విరామ సమయంలో మూడవ తరగతి విద్యార్థి వంశీ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, కాళ్లు కాలడంతో పాటు తలకు గాయాలు అయ్యాయి. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 12, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 2

9. మానవులు మానవత్వముని ఎట్లు పొందుతారు? (జ.అధ్యయనం వలన), 10. మానవునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి? (జ. తపస్సుతో సాధుత్వం, శిష్టాచార భ్రష్టతవంతో అసాధుభావం సంభవిస్తాయి.)
11. మానవుడు మనుష్యుడెలా అవుతాడు? (జ.మృత్యు భయము వలన)
12. జీవన్మృతుడెవరు? (జ.దేవతలకు, అతిధులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
<<-se>>#YakshaPrashnalu<<>>


