News March 18, 2024
టెన్త్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు : సజ్జనార్

TG: పదో తరగతి పరీక్షలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘విద్యాశాఖ సూచన మేరకు పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి. ‘విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి ఫ్రీగా ప్రయాణించవచ్చు. క్షేమంగా వెళ్లి ప్రశాంతంగా పరీక్ష రాయండి’ అని పేర్కొన్నారు.
Similar News
News September 9, 2025
మూడు రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News September 9, 2025
గద్దెల మార్పు నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు: మేడారం పూజారులు

TG: మేడారంలో గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెల మార్పు అంశంతో ప్రభుత్వానికి, మంత్రులు సీతక్క, సురేఖకు ఎలాంటి సంబంధం లేదని పూజారుల సంఘం ప్రకటించింది. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలాలను ముట్టుకోకుండా ఈ మార్పు జరుగుతుందని పేర్కొంది. భక్తుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా దేవతల గద్దెలు ఒక్కో దిక్కున ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
News September 9, 2025
తెలుగు జాతికి నేడు చీకటి రోజు: షర్మిల

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి TDP, జనసేన, YCP మద్దతుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘తెలుగు జాతికి నేడు చీకటి రోజు. తెలుగు బిడ్డ(సుదర్శన్ రెడ్డి) పోటీ పడితే, RSS వాదికి ఓటు వేయించిన 3 పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు. మత పిచ్చి మోదీకి మోకాళ్లు ఒత్తడమే వారి లక్ష్యం. BJPకి ఓటు వేసినందుకు YCP సిగ్గుపడాలి. కేసులకు భయపడి మోదీకి జగన్ దత్తపుత్రుడిగా అవతారం ఎత్తారు’ అని ట్వీట్ చేశారు.