News January 24, 2025
పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఐఈఓ

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈఓ అంజయ్య అన్నారు. గురువారం పానగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో చదువుపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పరీక్షలు ముగిసే వరకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలన్నారు.
Similar News
News November 14, 2025
PDPL: సబ్ రిజిష్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

పెద్దపల్లి జిల్లా సబ్ రిజిష్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ విజయ కుమార్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిష్టర్ కార్యాలయాల్లో అవినీతి నిర్ములించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి సబ్ రిజిష్టర్ కార్యాలయంలో పలు రికార్డులను, డాక్యుమెంట్లు, ఇతర పాత్రలను పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లను సైతం విచారిస్తున్నారు.
News November 14, 2025
పోలీసులు అలెర్ట్‌గా ఉండాలి: ఎస్పీ

ఢిల్లీ పేలుళ్లను దృష్టిలో పెట్టుకొని గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బందితో వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఉండే సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రతీ రెండు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
News November 14, 2025
NLG: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు: జిల్లా ఎస్పీ

నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండలోని సెయింట్ ఆల్ఫన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ యుగంలో యువత చిన్న వయస్సులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


