News January 24, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి: నిర్మల్ కలెక్టర్

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3 రోజులపాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆరా తీశారు. గురువారం వేడుకలు ఆహ్వాన పత్రాన్ని అందజేయడానికి వెళ్లిన ఆలయ అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.
Similar News
News November 3, 2025
బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వంటి చర్మవ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News November 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 55

1. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు?
2. విచిత్రవీర్యుని తండ్రి ఎవరు?
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎన్ని రోజులు ఎత్తి పట్టుకున్నాడు?
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు ఏమంటారు?
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని ఏమంటారు?
– సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 3, 2025
పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.


