News January 24, 2025

APలో HCLను విస్తరించాలని లోకేశ్ వినతి

image

APలో HCLను మరో 10వేల మందికి ఉపాధి కల్పించేలా విస్తరించాలని ఆ సంస్థ సీఈవో కళ్యాణ్‌కుమార్‌ను మంత్రి లోకేశ్ కోరారు. దావోస్ పర్యటనలో భాగంగా జరిగిన భేటీలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీల్లో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రోత్సాహకాలు ప్రకటించామని, ఏపీలో రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్‌మెంట్ ఇంపోర్టుకు 50శాతం రాయితీలు ఇస్తామన్నారు.

Similar News

News January 24, 2025

బీఆర్ఎస్ పార్టీకి షాక్

image

TG: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. రేపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

News January 24, 2025

సైఫ్‌కు రూ.25 లక్షల బీమాపై జోరుగా చర్చ

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి రూ.25 లక్షల బీమా మంజూరు చేయడం SMలో విస్తృత చర్చకు దారితీసింది. అదే సామాన్యులకైతే ఎన్నో కొర్రీలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకున్న తర్వాత ఏదో కొంత ఇస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామాన్యులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్లైమ్ చేయరు. VVIPలకు మాత్రం ఆగమేఘాల మీద బీమా క్లెయిమ్ చేస్తారని మండిపడుతున్నారు.

News January 24, 2025

తలకు ఆనుకొని భారీ కణితి.. కాపాడిన వైద్యులు

image

ఫొటో చూసి రెండు తలలతో ఉన్న శిశువు అనుకుంటున్నారా? కాదు. ఈ పాపకు తలతో పాటు భారీ కణితి ఏర్పడింది. దీనిని ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ అనే డిసీస్ అని ఓ వైద్యుడు ఈ ఫొటో షేర్ చేశారు. పుట్టుకతోనే మెదడుతో పాటు చుట్టుపక్కల కణజాలం పుర్రె నుంచి బయటకు వస్తాయని తెలిపారు. ఎంతో క్లిష్టమైన చికిత్సను తాము పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం వల్ల వీటిని ముందే గుర్తించవచ్చన్నారు.