News January 24, 2025

దోమకొండ గడికోటలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

image

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గడికోటలోని మహాదేవుడిని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు.ప్రియాంక చోప్రాకు గడికోట సభ్యులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కాగా ప్రియాంక చోప్రా గతంలో హీరో రాంచరణ్ తేజ్‌తో కలిసి జంజీర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో ఈ దేవాలయం ప్రత్యేకతను ప్రియాంకకు వివరించగా..తాజాగా ఆమె ఈ కోటను దర్శించుకున్నారు.

Similar News

News January 16, 2026

బంగ్లాను దారికి తెచ్చేందుకు జైషా ‘డైరెక్ట్ అటాక్’!

image

T20 వరల్డ్ కప్ విషయంలో మొండికేస్తున్న బంగ్లా బోర్డును దారికి తెచ్చుకునేందుకు ICC కీలక అడుగు వేయనుంది. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేసేలా ICC ప్రతినిధుల బృందం త్వరలో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ‘మేం ఇండియాకు రాబోం’ అని బంగ్లా చెప్పినట్లు తెలుస్తోంది. చివరి యత్నంగా ఈ ‘వన్ టు వన్’ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని ICC డిసైడైనట్లు అర్థమవుతోంది.

News January 16, 2026

వంటింటి చిట్కాలు

image

* కప్పు వెనిగర్ లో టేబుల్ స్పూను ఉప్పు కలిపి వేడిచేయాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే రాగి పాత్రలకు పట్టించి చల్లారాక శుభ్రపరిస్తే సరి. కొత్తవాటిలా మెరుస్తాయి. * నిల్వ ఉంచిన మష్రూమ్స్ తాజాగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించేందుకు వాటిని వెల్లుల్లితో కలిపి ఉడికించండి. రంగు మారితే అవి పాడయినట్లు అర్థం. * డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే దరిచేరవు.

News January 16, 2026

భీమవరంలో రైల్వే ట్రాక్‌పై బాలిక మృతదేహం కలకలం

image

భీమవరం-ఉండి రహదారిలోని రైల్వే గేటు సమీపంలో ట్రాక్‌పై శుక్రవారం ఓ గుర్తు తెలియని బాలిక(3) మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. రైల్వే ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్లే ఆ చిన్నారి మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందిన బాలిక గురించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే భీమవరం రైల్వే గవర్నమెంట్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.