News January 24, 2025
BREAKING: టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ను అందుబాటులో ఉంచనుంది.
Similar News
News January 16, 2026
ADB: 18న కొమురం భీమ్ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

కొమురం భీమ్ స్టడీ సర్కిల్ HYD 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ASFలోని స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ జిల్లా లింగపూర్‌లోని ఏకలవ్య టీఆర్‌సీ కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మెయిల్ ద్వారా సమాచారం అందుకున్న అభ్యర్థులు మాత్రమే ప్యాడ్, పెన్నులతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వద్ద భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2026
BREAKING: ఫ్లిప్‌కార్ట్, మీషో, అమెజాన్‌కు షాక్

చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్నందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా వంటి ఈకామర్స్ సంస్థలపై CCPA కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కో సంస్థకు ₹10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ దాటిన వైర్‌లెస్ పరికరాలకు లైసెన్స్, ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ (ETA) తప్పనిసరి. ముందస్తు అనుమతులు లేదా లైసెన్సింగ్ సమాచారం లేకుండానే వీటిని విక్రయించినట్లు తేలింది.
News January 16, 2026
OTTలో కొత్త సినిమాలు.. చూసేయండి!

సంక్రాంతి సందర్భంగా కొన్ని కొత్త సినిమాలు OTTలోకి వచ్చాయి. శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా ‘120 బహదూర్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, జగపతిబాబు, సుహాసిని తదితరులు నటించిన ‘అనంత’ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ZEE5లో గుర్రం పాపిరెడ్డి, సోనీలివ్‌లో మమ్ముట్టి ‘కలాంకావల్’ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో వారం కిందట బాలయ్య ‘అఖండ-2’ విడుదలైంది.


