News January 24, 2025
పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 17, 2026
నల్గొండ తొలి మేయర్‌గా ‘ఆమె’

నల్గొండ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారైంది. ప్రభుత్వం ఈ పదవిని ‘జనరల్ మహిళ’కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 17, 2026
NGKL: రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం

రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
News January 17, 2026
రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.


