News January 24, 2025
సాతర్లలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

జోగులాంబ గద్వాల జిల్లాలో హెచ్చుతగ్గు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో మొన్నటి వరకు చలి తీవ్రత పెరిగిన.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటలలో సాతర్లలో 15.4 డిగ్రీలు, చిన్న తాండ్రపాడులో 15.6 డిగ్రీలు, బూడిదపాడులో 15.9 డిగ్రీలు, వడ్డేపల్లి, తోతినొనిదొడ్డిలో 16.1 డిగ్రీలు, ధరూర్, జల్లాపూర్‌లో 17.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News July 6, 2025
HYD: మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.
News July 6, 2025
HYD: త్వరలో ORR వరకు అన్ని ఎలక్ట్రిక్ బస్సులే..!

త్వరలో HYD అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని RTC బస్సులను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ HYD పరిధి ఉప్పల్, ఖైరతాబాద్, నారాయణగూడ, కాచిగూడ, సికింద్రాబాద్, ప్యారడైజ్ బేగంపేట సహా అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణ సర్వీసులు అందజేస్తున్నాయి. ఎక్స్ ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తింపజేస్తున్నారు.
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <