News January 24, 2025
WGL: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర నిన్న రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.14,000కి చేరింది. మరోవైపు 341 రకం మిర్చికి గత 2 రోజుల లాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 27, 2025
మరణంలోనూ వీడని స్నేహం

కర్ణాటకలో జరిగిన ఘోర <<18664780>>బస్సు ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదం నింపింది. చనిపోయిన వారిలో నవ్య, మానస అనే ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. మరణంలోనూ వారు కలిసే ఉన్నారంటూ నవ్య తండ్రి రోదించారు. ‘వాళ్లు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకే కంచంలో తినేవారు. ఒకేచోట చదువుకున్నారు. ఒకే రకం డ్రెస్సులు వేసుకునే వారు. ఒకేచోట పని చేస్తున్నారు. సెలవని ఇంటికొస్తూ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు’ అని విలపించారు.
News December 27, 2025
ఆందోల్: నీటిలో మునిగి బాలుడు మృతి

ఆందోల్ మండలం మాన్సాన్‌పల్లికి చెందిన ప్రసాద్(16) నీట మునిగి చనిపోయాడు. స్నేహితులతో కలిసి ఘనపూర్ ప్రాజెక్టు రెండో బ్రిడ్జి వద్ద ఈతకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నీటిలో మునిగిపోతున్న ఓ స్నేహితుడిని రక్షించే క్రమంలో ప్రసాద్ లోతులోకి వెళ్లి చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న మత్స్యకారుడు ఒకరిని రక్షించగలిగినప్పటికీ, ప్రసాద్ చనిపోయాడు. పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
News December 27, 2025
యూపీలో 2.89కోట్ల మంది ఓటర్లు తొలగింపు!

ఉత్తర్ ప్రదేశ్‌లో SIR గడువు నిన్నటితో ముగియగా DEC 31న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో 15.44కోట్ల మంది ఓటర్లకు గానూ 2.89కోట్ల మందిని తొలగించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో 1.26కోట్ల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది. 31న రిలీజ్ చేసే లిస్టులో అభ్యంతరాలు ఉంటే JAN 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆ రాష్ట్ర CEO నవదీప్ రిన్వా తెలిపారు. FEB 28న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తామని చెప్పారు.


