News January 24, 2025

WGL: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర నిన్న రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.14,000కి చేరింది. మరోవైపు 341 రకం మిర్చికి గత 2 రోజుల లాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. హనుమకొండ జిల్లాకు ఏం కావాలంటే?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లాలోని పెండింగ్ పనులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్ట్ భూ-సేకరణ పూర్తి చేయాలని, కాజీపేట రైల్వే ఫ్లై-ఓవర్ చేపట్టాలని కోరుతున్నారు. WGL కలెక్టరేట్ పనులు, నూతన బస్టాండ్ పనులు, టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.

News March 12, 2025

సొంత నిధులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తా: మంత్రి లోకేశ్

image

AP: కడప జిల్లాలోని కాశీనాయన అన్నదాన సత్రం కూల్చివేతపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కూల్చివేయడం బాధాకరం. నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి కూల్చకుండా ఉండాల్సింది. దీనిపై ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను’ అని ట్వీట్ చేశారు.

News March 12, 2025

భైంసా: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

భైంసా మండలం కోతుల్గాం గ్రామానికి చెందిన రైతు పాలబోయిన భోజన్న(62) మంగళవారం కరెంట్ షాక్‌తో మరణించినట్లు భైంసా గ్రామీణ సీఐ నైలు తెలిపారు. మొక్కజొన్న పంటకు నీరందించేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు పంటకు జంతువుల బారి నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

error: Content is protected !!