News January 24, 2025
ఫీజులోనూ ఈ వ్యత్యాసం ఎందుకు?.. విద్యార్థి ఆవేదన
పోటీ పరీక్షల్లో రిజర్వేషన్లను దాటుకొని సీటు సాధిస్తే.. ఫీజులోనూ వ్యత్యాసం చూపడం ఏంటని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ MBBS ఫీజు GENకి రూ.14లక్షలు, OBCకి రూ.8లక్షలు, SC/STకి 0, EWS విద్యార్థులకు రూ.7లక్షలు అని ఉంది. తమ తల్లిదండ్రులూ అప్పులు చేసి చదివిస్తున్నారంటూ కొందరు వాపోతున్నారు. ఇక్కడైనా రిజర్వేషన్ తీసేయాలని సూచిస్తున్నారు.
Similar News
News January 24, 2025
అప్రూవర్‌గా VSR.. జగన్ డిస్ క్వాలిఫై: బీటెక్ రవి
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయ్ సాయి రెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి ట్వీట్ చేశారు. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై అవుతారని జోస్యం చెప్పారు. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయమన్నారు.
News January 24, 2025
‘పతంజలి’ కారం పొడి కొన్నారా?
పతంజలి ఫుడ్స్ కంపెనీ AJD2400012 బ్యాచ్ నంబర్ కలిగిన 4 టన్నుల కారం పొడి ప్యాకెట్లను (200gms) రీకాల్ చేసింది. ఆ కారం ఆహార భద్రతా ప్రమాణాలకు లోబడి లేదని, వాటిలో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని సంస్థ సీఈఓ తెలిపారు. FSSAI ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాకెట్లను వినియోగదారులు ఎక్కడ కొన్నారో అక్కడే తిరిగి ఇచ్చేయాలని, మనీ రీఫండ్ చేస్తారని చెప్పారు.
News January 24, 2025
హరీశ్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు: మంత్రి ఉత్తమ్
TG: ఏపీ ప్రాజెక్టులకు అనుమతుల ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాము ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే నదీ జలాల్లో నష్టం జరిగిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. మన జలాలను కేసీఆర్ హయాంలోనే ఏపీ ఎత్తుకెళ్లిందని విమర్శించారు. <<15245846>>హరీశ్ రావు<<>> పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.