News January 24, 2025
క్రికెటర్ల వరుస విడాకులు.. అసలేం జరుగుతోంది!
భారత క్రికెటర్లు విడాకులు తీసుకోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. కొందరు ప్రొఫెషనల్ కెరీర్లో సక్సెస్ అయినా కుటుంబ వ్యవహారాల్లో ఫెయిల్ అవుతున్నారు. స్పిన్నర్ చాహల్, తన భార్య ధనశ్రీ విడిపోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన 20ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పేందుకు సిద్ధమైనట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. కాగా ధవన్, షమీ, పాండ్య ఇప్పటికే విడాకులు తీసుకున్నారు.
Similar News
News January 25, 2025
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దు: హైకోర్టు
TG: రాష్ట్రంలో సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉ.8.40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై విచారించింది. రేట్ల పెంపు అనుమతులను రద్దు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.
News January 25, 2025
రాజకీయాల్లోకి త్రిష? తల్లి ఏమన్నారంటే?
సినీ నటి త్రిష త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తల్లి ఉమా కృష్ణన్ ఖండించారు. త్రిష సినిమాలను వదిలేస్తారన్న వార్తల్లో నిజం లేదని, ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే సినిమాలను వదిలేయడంపై త్రిష, ఆమె తల్లికి మధ్య వివాదం జరిగినట్లు ఇటీవల ఓ తమిళ సినిమా క్రిటిక్ పేర్కొన్నారు. దీనిపై త్రిష నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News January 24, 2025
అప్రూవర్‌గా VSR.. జగన్ డిస్ క్వాలిఫై: బీటెక్ రవి
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయ్ సాయి రెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి ట్వీట్ చేశారు. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై అవుతారని జోస్యం చెప్పారు. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయమన్నారు.