News January 24, 2025
జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న పాలకవీడు మండలం జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గంధం ఊరేగింపును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు దర్గాలో సైదులు బాబా సమాధులపై చాదర్‌ను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, వక్ఫ్ బోర్డ్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.
News September 17, 2025
చాకలి ఐలమ్మ స్ఫూర్తి యోధులు వీరే..!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మరికొందరు పోరాట యోధులు ఆమె పోరాట శైలిని స్ఫూర్తిగా తీసుకొని సాయుధ పోరాటంలో ఉద్యమించి ప్రాణాలర్పించారు. వారే పాలకుర్తికి చెందిన జీడి సోమయ్య, చాకలి సోమయ్య, మామిండ్ల ఐలయ్య, ఆకుల వెంకటయ్య, కమ్మరి బ్రహ్మయ్య, చుక్కా సోమయ్య, జీడి బాలయ్య, జీడి కొమురయ్య, వీరమనేని రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.
News September 17, 2025
దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.