News January 24, 2025

SHOCKING: అల్ట్రా HDలో ‘గేమ్ ఛేంజర్’ లీక్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా అల్ట్రా HDలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది థియేటర్ ప్రింట్ కాదని, మూవీ ఎడిటింగ్ టీమ్ నుంచే లీక్ అయిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో CG వర్క్ లేదని స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు. రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తే.. ఇలా పైరసీ చేస్తారా? అని మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 20, 2026

బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

image

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.

News February 20, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 3 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిప్లొమా, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. మార్చి 17, 18 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.40,000-రూ.1,40000వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://rites.com/

News February 20, 2026

‘కాక్‌టైల్ 2’ క్రేజీ అప్‌డేట్.. రష్మిక, కృతి సనన్ లెస్బియన్ రొమాన్స్?

image

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కాక్‌టైల్ 2’లో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ కపుల్‌గా నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉంటుందని టాక్. కొత్త రకం పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్న ఈ స్టార్ హీరోయిన్ల బోల్డ్ ప్రయోగంపై నెట్టింట చర్చ నడుస్తోంది. septలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని Maddock Films నిర్మిస్తోంది.