News January 24, 2025
KMR: పేదలకు లబ్ధి చేకూర్చాలి: కలెక్టర్

పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. జాబితాలో పేరు రానివారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించారు.
Similar News
News January 16, 2026
నిజామాబాద్‌లో కొండెక్కిన చికెన్ ధరలు

నిజామాబాద్‌లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.
News January 16, 2026
ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News January 16, 2026
నంద్యాల: అవును.. మీకు తెలుసా..!

నల్లమల అడవిలోని గిరిజన గూడాల్లో నివసించే చెంచులు శ్రీశైల భ్రమరాంబ దేవిని కూతురుగా, మల్లికార్జున స్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో మకర సంక్రాంతి రోజున పార్వతి పరమేశ్వరుల లీల కళ్యాణ మహోత్సవానికి చెంచులే అతిథులుగా నిలిచి, ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామి, అమ్మవార్లను అలంకరిస్తారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు.


