News January 24, 2025
GWL: ఈనెల 26 నుంచి మరో 4 కొత్త పథకాలు..!

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి మరో నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పూడూరులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 14, 2025
అంబేడ్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది: హరీష్ రావు

బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో దుయ్యబట్టారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని దళితుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కూడా కాంగ్రెస్ అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని ధ్వజమెత్తారు.
News March 14, 2025
వికారాబాద్: ‘పండుగ పేరుతో హద్దులు దాటొద్దు’

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు చల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తారు. అయితే కొందరు ఆకతాయిలు పండగ పేరుతో హద్దు మీరి ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి రంగులు పూయడం చేస్తారు. ఎదుటివారి ఇష్టంతో మాత్రమే రంగులు చల్లడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో దూరంగా ఉంచుతూ హుందాగా వ్యవహరించాలని, పండగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు తెలిపారు.
News March 14, 2025
సూపర్ ఐడియా కదా..!

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!