News January 24, 2025
మెదక్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడానికి ఇవాళ వరకు జాబితా ఇవ్వాలని సూచించారు.
Similar News
News January 25, 2025
మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఈ- ఆఫీస్ అమలు: కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ- ఆఫీస్ కార్యక్రమానికి శ్రీకారం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు పేపర్‌పై పని తగ్గించాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా తయారు చేసేందుకు కృషి చేయాలన్నారు. సంబంధిత కార్యాలయాల్లో విద్యుత్‌ను ఆదా చేసి ఈ- ఆఫీస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News January 24, 2025
ప్రారంభమైన చిత్తారమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు
రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు గణపతి పూజ, అమ్మవారికి ఘటాభిషేకం, కంకణ ధారణ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, నిత్యబలిహారం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
News January 24, 2025
మాసాయిపేట: భార్య దూరంగా ఉంటుందని ఆత్మహత్య
అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిన ఒక వ్యక్తి గ్రామ శివారులో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నర్సింహ చారి ఈనెల 21న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే భార్య గత కొంత కాలంగా దూరంగా ఉండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఫిర్యాదు చేశారు.