News January 24, 2025

మంథని: దావోస్‌లో మంత్రి శ్రీధర్ బాబు

image

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF2025) సదస్సు ఈనెల 20వ తేదీన ప్రారంభం కాగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చిన విషయం విధితమే. అయితే ఈ నెల 27వ తేదీ వరకు మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు దావోస్‌లోనే ఉండనున్నారు. చివరి సమావేశాల వరకు అక్కడే ఉండి ఈనెల 27వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు.

Similar News

News January 14, 2026

త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఇలా చేయండి

image

పిల్లల్ని కనడం అనేది చాలా మంది మహిళల కల. దీని కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. విటమిన్ D, C స్థాయిలు సరిగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. 3 నెలల ముందునుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

News January 14, 2026

HYD: సిటీలోని జైళ్లు కూడా డిజిటల్ మయం!

image

సిటీలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో పాత పద్ధతులకు కాలం చెల్లింది. అంతా టెక్నాలజీ హవానే. రూ.2.5 కోట్ల విలువైన డ్రోన్లు, కంప్యూటర్లు, వాకీటాకీలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘స్వాగతం’ పోర్టల్, ఈ-ఆఫీస్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోయింది. ఖైదీలు తమ కేసు స్టేటస్ చూసుకోవడానికి 52 కొత్త మెషిన్లు కూడా వచ్చేశాయి. టెక్ అప్‌గ్రేడ్‌తో తెలంగాణ జైళ్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.

News January 14, 2026

MDCL: ఫిట్స్ టాబ్లెట్స్ కొంటున్నారా..? జాగ్రత్త..!

image

ఫిట్స్ తగ్గటం కోసం డాక్టర్లు రాసే ఔషధల్లో Levipil 500 ఒకటి. అయితే.. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో సన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఈ మందులను తయారు చేస్తున్నట్లుగా టాబ్లెట్ షీట్లపై ముద్రించి విక్రయిస్తున్నట్లు DGCA అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని సీజ్ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టాబ్లెట్లు కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.