News March 18, 2024
కోరుట్ల: చేపలు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన చిన్నరాయుడు(30) ఆదివారం గ్రామ శివారులోని వాగు పరివాహక ప్రాంతంలో చేపలు పెట్టేందుకు వెళ్ళాడు. ఈక్రమంలో వ్యవసాయ మోటార్‌కు ఉన్న విద్యుత్ తీగను నీటి గుంతలో వేసి బండరాయిపై కూర్చుని చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.
Similar News
News November 24, 2024
మంథని: కోటి దీపోత్సవంలో శ్రీధర్ బాబు
హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం దివ్యానుభూతి ఇచ్చిందన్నారు. కార్తీకమాస పూజల్లో భాగంగా సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అపూర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ నిర్వాహకులను అభినందించారు.
News November 24, 2024
జగిత్యాల: మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన చేప
జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన గంగ పుత్రులకు ఓ అరుదైన చేప చిక్కింది. సక్కరమౌత్ క్యాట్ ఫిష్ అనే అరుదైన చేప తులసినగర్కి చెందిన గంగపుత్రుడు నవీన్ వలకు చిక్కింది. ఈ చేపను మార్కెట్లోకి అమ్మకానికి తీసుకు రావడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలోని మంచినీటిలో ఉంటాయని నవీన్ తెలిపారు.
News November 24, 2024
KNR: తెలంగాణ దర్శిని కార్యక్రమ సమావేశం
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం తెలంగాణ దర్శిని కార్యక్రమంపై పర్యాటక శాఖ కమిటీ సమావేశం కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన నిర్వహించారు. పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు వెళ్లడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు,చారిత్రక ప్రదేశాలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని కలెక్టర్ చెప్పారు. అనంతరం విద్యార్థులను తీసుకెళ్లే పర్యాటక ప్రాంతాల గురించి అధికారులతో చర్చించారు.