News January 24, 2025

పాడేరు: ‘లొంగిపోయిన మావోల సమస్యల పరిష్కారానికి కృషి’

image

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు, మిలీషియా సభ్యులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ఎస్పీ అమిత్ బర్దార్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ కే.ధీరజ్‌తో కలిసి సరళ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టు, మిలీషియా సభ్యుల పిల్లలతో సమావేశం నిర్వహించారు. వారి చదువు, ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన కల్పించారు. బాగా చదువుకోవాలన్నారు.

Similar News

News November 18, 2025

బంగ్లాదేశ్ యువకుడిని అరెస్ట్ చేసిన అనకాపల్లి పోలీసులు

image

బాలికతో సహజీవనం చేస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ (విక్రమ్ ఆలీ)ని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. పాస్ పోర్ట్, వీసా లేకుండా కాకినాడలో ఉంటూ బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఇక్కడికి తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీళ్లిద్దరిని పట్టుకున్నామన్నారు.

నల్గొండ: మిల్లుల సమ్మె.. పత్తి రైతుల దిగాలు

image

తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ సోమవారం నుంచి చేస్తున్న సమ్మె ప్రభావం ఉమ్మడి జిల్లా పత్తి రైతులపై తీవ్రంగా పడింది. ఈసమస్యపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో, మంగళవారం కూడా మిల్లులు తెరవకుండా సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ తెలిపింది. స్లాట్ బుక్ చేసుకున్న రైతుల కొనుగోళ్లు రద్దు కావడంతో, మళ్లీఎప్పుడు బుక్ అవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి, మిల్లులనుతెరిపించాలని రైతులు కోరారు.