News January 24, 2025
రాజోలు: ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

రాజోలు మండలం కూనవరం గ్రామంలో శ్రీఅన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భూమి పూజలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు. దీనికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News January 10, 2026
బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(1/2)

ఈ పద్ధతిలో చెరకు గడల నుంచి అర్ధ చంద్రాకారపు కన్నులను వేరు చేసి పెంచుతారు. చెరకు గడల్లో కుళ్లిన, వేర్లు వచ్చిన చెరకు కన్నులను విత్తన శుద్ధి చేసుకొని ట్రేలలో అమర్చుకోవాలి. ఈ పద్ధతిలో మూడు కళ్ల ముచ్చెలకు బదులుగా చెరకు కన్నులను మాత్రమే యంత్రం సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడతారు. ప్లాస్టిక్ ట్రేలలో గుంతలను 1/3 వంతు వరకు కోకోవిట్‌తో నింపి కన్నులను పైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి.
News January 10, 2026
రైల్వే పిట్ లైన్ కోసం కృషి: ఎంపీ శబరి

నంద్యాలకు రైల్వే పిట్ లైన్ కోసం కృషి చేస్తున్నానని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. రైల్వే పిట్ లైన్ ఏర్పాటు వల్ల నంద్యాల వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రైల్వే పిట్ లైన్ అనేది నియమించబడిన ఒక ట్రాక్ అని, దీనివల్ల రైల్వే సిబ్బంది రైలు కింద సులభంగా పనిచేయడానికి వీలుంటుందని అన్నారు.
News January 10, 2026
బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(2/2)

చెరకు ట్రేలను ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చి ప్లాస్టిక్ షీట్లతో గాలి తగలకుండా కప్పాలి. మొలకెత్తిన ట్రేలను 4వ రోజు గ్రీన్‌హౌస్‌లోకి మార్చుకొని రోజు విడిచి రోజు నీటితో తడపాలి. విత్తు పొడవు 5 సెం.మీ. ట్రై క్యావిటీ 98 సి.సి కలిగినవి అయితే మొలకలు 25-30 రోజుల వరకు ఆరోగ్యవంతంగా ఉండి మంచి దిగుబడి వస్తాయి. బడ్ చిప్ పద్ధతిలో నారు పెంచడానికి లేత తోటల నుంచి పురుగులు, తెగుళ్లు ఆశించని గడలనే ఎంపిక చేసుకోవాలి.


