News January 24, 2025

ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరో వైపు ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఉదయం 9 గంటలకు మానవహారం ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి రంగనాథ్ తెలిపారు.

Similar News

News September 17, 2025

ASF: నిజాం నిరంకుశత్వంపై సాధించిన విజయమే తెలంగాణ విమోచనం: బీజేపీ

image

తెలంగాణ ప్రజలకు అష్ట కష్టాలు పెట్టిన నిజాం, రజాకారుల దాష్టికాల నుంచి తెలంగాణ విమోచనం జరిగిందని BJP జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. విమోచన దినం సందర్భంగా ఆసిఫాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. చాకలి ఐలమ్మ వంటి ఎంతో మంది వీరమాతలు రజాకార్లపై తిరగబడి సాధించిన తెలంగాణ ఇది అన్నారు.

News September 17, 2025

అమరావతి: అసైన్డ్ రైతులకు ఊరట

image

అమరావతి రాజధాని కోసం తమ అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. గతంలో రిటర్నబుల్ ప్లాట్లలో ‘అసైన్డ్’ అని పేర్కొనడంతో అవి అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లోని కాలమ్ నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్‌ను తొలగిస్తూ జీవో నంబర్ 187ను బుధవారం విడుదల చేసింది.

News September 17, 2025

‘రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

image

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని 3,03,568 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ. 305.98 కోట్లు ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద జమ చేశామని పేర్కొన్నారు. దీంతోపాటు, ప్రభుత్వం జిల్లాలో 1,96,554 మంది రైతులకు పంటల బీమా కల్పించిందని, ఇది ఆపత్కాలంలో రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.